బయటపడిన 28 మృతదేహాలు

దాదాపు 70 మంది జాడ తెలియడం లేదు. నాగులదిన్నెలో 9 మంది, మంత్రాలయంలో నలుగురు కనిపించడం లేదు. కర్నూలులో వరద తగ్గుముఖం పట్టింది. తన స్వగ్రామం రాంపూర్ లో మిద్దెపై ప్రాణాలు అరచేతి పట్టుకుని సాయం కోసం ఎదురు చూసిన స్థానిక శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలులో చాలా వరకు వరద తగ్గింది. అయితే సాయం అందక బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళనకు దిగారు. తమకు ఏ విధమైన సాయం అందడం లేదని వారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications