యుద్ధ ప్రాతిపదికన చర్యలు: ధర్మాన

Rosaiah
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను అమలు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు చెప్పారు. వరద పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన శనివారం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశం వివరాలను ధర్మాన ప్రసాదరావు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఈ సాయంత్రానికి సహాయక చర్యలు పూర్తవుతాయని ఆయన చెప్పారు. విపత్తులను ఎదుర్కునేందుకు శాశ్వత ప్రాతిపదికపై జిల్లా కలెక్టర్లకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటి వరకు 4.53 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన చెప్పారు. ఏడు హెలికాప్టర్లు సహాయ చర్యలు చేపట్టాయని ఆయన చెప్పారు. సహాయక చర్యలకు 48 మరబోట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ కు 8, కర్నూలుకు 24, విజయవాడకు 16 బోట్లు వెళ్లాయని చెప్పారు. అదనంగా మహబూబ్ నగర్ కు 20, కర్నూలుకు 50, విజయవాజకు 16 బోట్లు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైతే హెలికాప్టర్లను ఇంకా తెప్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం 168 బోట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమైనట్లు ఆయన తెలిపారు.

ఇప్పటి వరకు లక్ష ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్లు, మరో 50 వేల ఆహార పొట్లాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే వరద ఉధృతిని తట్టుకునేందుకు విజయవాడలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ధర్మాన చెప్పారు. వరద తాకిడికి ఇప్పటి వరకు 16 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. వాతావరణం సహకరించకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+