40 లంక గ్రామాలకు ముంపు భయం

చెన్నై - విజయవాడ మధ్య రైళ్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. దివిసీమకు సముద్రం పోటు భయం పొంచి ఉంది. పలు గ్రామాలు జలమయ్యాయి. విజయవాడ రూరల్, అర్బన్ మండలాలతో పాటు ఇతర గ్రామాలు కూడా ప్రాణభయంతో గింజుకుంటున్నాయి. దాదాపు 70 గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు అందుకు మొరాయిస్తున్నారు. వారిని బయటకు రప్పించేందుకు విద్యుత్ సరఫరా ఆపించారు. మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నదికి 4 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం వద్ద వరద ఉధృతి తగ్గడం లేదు. ఆనకట్ట పై నుంచి నీరు ప్రవహించే పరిస్థితి ఉంది. దీంతో కృష్ణా బ్యారేజీకి ఇంకా నీరు చేరే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications