ఊహాగానాలకు జూ. ఎన్టీఆర్ తెర

జూనియర్ ఎన్టీఆర్ మంగళవారంనాడు ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయల విరాళాన్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చంద్రబాబుకు దూరమైనట్లు ప్రచారం సాగింది. పైగా, జూనియర్ ఎన్టీఆర్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావుతో కలిసి సచివాలయానికి వచ్చి రోశయ్యను కలవడం దుమారం రేపింది. కాంగ్రెసు పార్టీ దగ్గర కావడానికి ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్ అందుకు పూనుకున్నట్లు భావించారు. ఈ ఊహాగానాలకు తెర వేయడానికి ఆయన బుధవారం చంద్రబాబును కలిసి చెక్కును అందించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications