వైయస్సార్ ప్రమాదం ఇందుకే: బాబు

గతంలో పని చేసిన ముఖ్యమంత్రులెవరూ ఇంతగా వ్యవస్థలను నిర్వీర్యం చేయలేదని, బలహీనమైన ముఖ్యమంత్రులున్న కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. వరదలకు సంబంధించి ముందుస్తు హెచ్చరికలు చేయడానికి అవసరమైన వ్యవస్థలున్నాయని, అయితే వాటిని పనిచేయలేని స్థితి కల్పించారని, అందువల్లనే వరదల గురించి ముందస్తుగా ప్రజలను హెచ్చరించి జాగ్రత్త పడేలా చేయలేకపోయారని, దాని వల్లనే వరదల వల్ల ఇంతగా నష్టం సంభవించిందని ఆయన అన్నారు.వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వ యంత్రాంగాలేవీ పని చేయలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాము వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చగలం గానీ సహాయం అందించాల్సింది ప్రభుత్వమేనని, అయితే ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోందని ఆయన అన్నారు. తాము యథాశక్తి సహాయం అందించడానికి కూడా ప్రయత్నిస్తున్నామని, వరద తాకిడి ప్రాంతాలకు తమ పార్టీ బృందాలను పంపిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications