నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ!
మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ అనంతరం దలపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రమని భావిస్తున్న 'జన నాయగన్ ' విడుదలైనప్పటి నుంచి థియేటర్లలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను చూడటానికి అభిమానులు థియేటర్లకు తరలివెళ్తున్నారు. ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శించబడుతుండగా.. దాని ఓటీటీ రిలీజ్ గురించి తాజా నివేదికలు ఊహాగానాలకు దారితీశాయి. ' జన నాయగన్' ఈ నెలాఖరులో జీ5 ఓటీటీ యాప్ లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు గానీ, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గానీ ధ్రువీకరించకపోవడం గమనార్హం.
ఇంకా ఖరారు కానీ ఓటీటీ రిలీజ్ డేట్!
జన నాయగన్ చిత్రం ఆగస్టు 21న జీ5లో ప్రీమియర్ కానుందని వార్తలు వస్తుండగా.. జననాయగన్ సినిమా ఓటీటీ విడుదలపై సందడి మళ్లీ మొదలైంది . ఈ నివేదిక నిజమైతే థియేటర్లలో విడుదలైన నెలలోపే ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుంది. ఊహాగానాలు పెరుగుతున్నప్పటికీ డిజిటల్ ప్రీమియర్‌కు సంబంధించి నిర్మాణ బృందం గానీ, జీ5 గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల తేదీని ఖరారు చేయడానికి అభిమానులు అధికారిక ధ్రువీకరణ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

జన నాయకన్ బాక్సాఫీస్ కలెక్షన్
జన నాయగన్ సినిమా జులై 23న తమిళ, తెలుగు, హిందీ, అనేక ఇతర భాషలలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రారంభంలోనే మంచి వసూళ్లను సాధించినప్పటికీ విజయ్ వీడ్కోలు చిత్రం నుంచి చాలా మంది ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ప్రదర్శనను కొనసాగించలేకపోయింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తలపతి విజయ్ వెట్రి కొండన్‌గా నటించగా.. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
శాక్‌నిల్క్ ప్రకారం, 'జన నాయగన్' ఇండియాలో తొలిరోజున రూ. 42.70 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో 14 రోజుల తర్వాత ఈ సినిమా ఇండియా నికర వసూళ్లు సుమారు రూ. 184 కోట్లుగా ఉండగా.. ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ. 308.67 కోట్లను దాటాయి. ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించినప్పటికీ.. విజయ్ గత చిత్రాలు నెలకొల్పిన అసాధారణమైన బాక్సాఫీస్ ప్రమాణాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది.




Click it and Unblock the Notifications