"నేనే బెటర్- ఏంటీ రచ్చ?"- రాజ్యసభ గందరగోళంపై సాయిరెడ్డి ఫైర్..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభల్లోనూ విపక్షాలూ రోజూ నిరసనలకు దిగుతున్నాయి. ఈసారి సమావేశాల ప్రారంభంలో నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సభల్ని విపక్షాలు స్తంభింపజేశాయి. అనంతరం ఆయన రాజీనామా చేసినా, ఢిల్లీలో విద్యార్దులపై పోలీసుల దాడులపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికీ సభల్ని అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజ్యసభలో గందరగోళంపై స్పందించారు.
ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభలు వరుసగా వాయిదా పడటంపై స్పందిస్తూ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులో అంతరాయాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతాయని, కీలకమైన అంశాలు చర్చకు రాకుండా మిగిలిపోతాయని, ఆ భారాన్ని పన్ను చెల్లింపుదారులు మోయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే గతంలో తాను రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే ప్యానెల్ ఛైర్మన్ గా పనిచేసిప్పటి సభ ఎలా జరిగేదో విజయసాయిరెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను ఉపాధ్యక్షుల ప్యానెల్‌లో సభ్యుడిగా రాజ్యసభకు అధ్యక్షత వహించినప్పుడు, నిరసనలు జరుగుతున్నప్పటికీ సభ సజావుగా పనిచేసేలా చూసుకున్నానని సాయిరెడ్డి గుర్తుచేశారు. అలాగే్గ మైక్రోఫోన్‌లకు శబ్దాన్ని తగ్గించే సౌకర్యాలు ఉన్నాయని, తాను సభ్యులను నిరసన తెలిపేందుకు అనుమతించినప్పటికీ, సభా కార్యకలాపాలను కొనసాగించానని చెప్పుకొచ్చారు. తద్వారా ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఆ పని చేయలేకపోతున్నట్లు పరోక్షంగా సాయిరెడ్డి చురకలు అంటించారు.




Click it and Unblock the Notifications