మీడియాపై మరోసారి యాదవ్ గుర్రు

SSP Yadav
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్ఎస్పీ యాదవ్ గురువారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. దినేష్ రెడ్డి ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్టీసి ఎండిగా ఉన్న దినేష్ రెడ్డి విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా జనరల్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా యాదవ్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. మీడియా ప్రతినిధులను బయటకు పంపించి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

డిజిపిగా పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి యాదవ్ మీడియాతో గొడవ పడుతూనే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన మీడియా ప్రతినిధులపై రుసరుసలాడారు. ఇటీవలి తిరుమలలో పురుగులు పడి చస్తారని కూడా ఆయన శాపనార్థాలు పెట్టారు. ఆర్టీసి అధికారులు సూచించినప్పటికీ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి నిరాకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రోశయ్యను కలవడానికి సచివాలయం వచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+