వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సేవ్ ద చిల్డ్రన్' సేవా కార్యక్రమం

By Santaram
|
Google Oneindia TeluguNews

Diwali Wish List
లండన్: ప్రపంచంలో అతిపెద్ద స్వతంత్ర చిన్నారుల దాతృత్వ సంస్ధ "సేవ్ ద చిల్డ్రన్" హిందూ, సిక్కుల పండుగ దీపావళి సందర్భంగా భద్రతా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 17 న వస్తోంది. 'విష్ లిస్ట్' కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతోంది.

సేవ్ ద చిల్డ్రన్ టీమ్స్ గుర్తించిన ప్రాణ రక్షణ కానుకలు విష్ లిస్ట్ లో భాగంగా న్నాయి. ఇండియాలోను ఇతర దేశాల్లోను సేవ్ చిల్డ్రన్ సంస్ధ సేవలు అందిస్తోంది. ఈ దీపావళి నాడు నిరుపేదలైన హిందువులు, సిక్కుల పిల్లలు ఆనందంగా గడిపేలా చర్యలు చేపట్టింది. బ్రిటన్ లో ఆసియన్లు చాలా మంది సంపన్నులు కాబట్టి వారి నుంచి ఆన్ లైన్ విరాళాలు సేకరించి భారతదేశంలోని నిరుపేద చిన్నారుల కళ్లల్లో దీపావళి కాంతులు నింపడానికి సేవ్ ద చిల్డ్రన్ సంస్ధ నడుం బిగించింది. దీనివల్ల బ్రిటన్ లోని సంపన్నులైన హిందువులు, సిక్కులు తమ సంస్కృతిని గుర్తుచేసుకుని విరాళాలు ఇవ్వడానికి ఈ సంస్ధ అవకాశం కల్పిస్తోంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రచార కార్యక్రమాన్ని లండన్ మీడియా ఏజెన్సీ, ఆల్ రెస్పాన్స్ మీడీయా, ఇండోర్ మీడియా యాడ్ మసాలా నెట్ వర్క్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్నాయి.

"దీపావళి కోసం క్యాంపెయిన్ చేయడం మాకు ఇదే ప్రధమం. ఇండోర్ మీడియా నుంచి, ఏఆర్ ఎం నుంచి ఎక్స్ పర్ట్ హెల్ప్ మాకు లభించడం సంతోషం కలిగిస్తోంది. చిన్నారుల జీవితాలపై ఈ క్యాంపెయిన్ మంచి ప్రభావం చూపగలదని ఆశిస్తున్నాం" అని సేవ్ ద చిల్డ్రన్ సంస్ధకు చెందిన ఎమిలీ బ్రౌనింగ్ అన్నారు.

"విష్ లిస్ట్ క్యాంఫెయిన్ కు ఇండోర్ మీడియా ఇచ్చిన మద్దతుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఇండోర్ మీడియా అంకిత భావం, మార్గదర్శకత్వం ప్రశంసించదగినవి." అని ఆల్ రెస్పాన్స్ మీడియా డిజిటల్ అకౌంట్ మేనేజర్ లారీ వాల్టన్ చెప్పారు. "గత రెండు దశాబ్దాలుగా ఇండియా ఆర్ధికంగా ఎంతో పురోగతి సాధించింది. వెలుగు వెంట చీకటిలా పేదల బతుకులు ఉన్నాయన్న వాస్తవాన్ని స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ఆవిష్కరించింది. బతుకు పోరాట సాగిస్తున్న లక్షలాది మంది చిన్నారులను ఆదోకోడానికి సేవ్ ద చిల్డ్రన్ సంస్ధ ముందుకు వచ్చింది. అది మాకెంతో ఆనండదాయకం. అదనపు అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీ ని విరాళంగా ఇవ్వవలసిందిగా భారతీయ ప్రచురణ కర్తలను అభ్యర్ధించాం" అని ఇండోర్ మీడియా కమర్షియల్ డైరెక్టర్ జే రాయ్ వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X