వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అక్టోబరు 14న శ్వేతసౌధంలో జరిగే దీపావళి పండుగలో స్వయంగా పాల్గొననున్నారు. శ్వేతసౌధంలో ఏటా దీపావళి పండుగను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. గత అధ్యక్షుడు జార్జిబుష్ హయాంలోనే ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అయితే, జార్జిబుష్ ఏనాడూ వేడుకల్లో స్వయంగా పాల్గొనలేదు. శ్వేతసౌధం సీనియర్ అధికారులు ఆయన తరఫున హాజరయ్యేవారు. నిజానికి దీపావళి పండుగను గత ఏడాది వరకు శ్వేతసౌధం ప్రాంగణంలోని అనుబంధ భవనంలో నిర్వహించేవారు. ఈసారి ఒబామా పాల్గొంటుండటంతో వేడుక ప్రధాన భవనంలోకి మారుతోంది.