ఇది రాజకీయ వైఫల్యమే: బాబు

Chandrababu Naidu
విజయవాడ: ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రంలో వరదలు సంభవించాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఆయన సోమవారం వరద తాకిడికి గురైన విజయవాడలో పర్యటించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వస్తుందని తెలిసినా కిందికి వదలకపోవడం పల్లనే వరదలు సంభవించాయని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంత్రులు బాధ్యతారహితంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. వరద నష్టంపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. తొలుత వరదలపై తాను ఏమీ మాట్లాడలేదని, రాజకీయాలు చేయకూడదనే ఉద్దేశంతోనే తాను మొదట్లో ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడలేదని ఆయన అన్నారు.

వరదలు చుట్టుముట్టగానే తాను తరుచుగా ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడుతూ సూచనలు చేశానని, కేంద్రం నుంచి తగిన సాయం రాబట్టాలని కోరానని ఆయన చెప్పారు. వరద నష్టాన్ని ప్రధాని దృష్టికి, కేంద్ర బృందం దృష్టికి తేవడానికి తాము ప్రయత్నించామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+