నిధులపై ప్రభుత్వం మొహమాటం: చిరు

వరదలకు పాక్షికంగా దెబ్బ తిన్న కర్నాటక రాష్టానికి, అతలాకుతలమైన మన రాష్ట్రానికి కేంద్రం సమానంగా సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కర్నాటకకు వేయి కోట్ల రూపాయలు, మన రాష్టానికి వేయి కోట్ల రూపాయలను కేంద్రం ప్రకటించిందని, మన రాష్ట్రం వరదలకు విపరీతంగా దెబ్బ తిన్నదని, అయినా కర్నాటకతో సమానంగానే మనకు కూడా కేంద్ర సాయం ప్రకటించారని ఆయన అన్నారు.
వరదలకు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు విలవిలలాడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో పుస్తకాలు, సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారికి తక్షణమే వాటిని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య బాధితులకు సాయం అందిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications