కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లా మహా ముత్తారం మండలం యత్నారం గ్రామంలో ప్రతిఘటన మాజీ దళ కమాండర్ రామ్ లాల్ ను నక్సలైట్లు కాల్చి చంపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మావోయిస్టులు గ్రామానికి వచ్చి అతన్ని హత్య చేశారు. ఇన్ ఫార్మర్ నెపంతోనే రామ్ లాల్ ను నక్సలైట్లు కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొంత కాలం ప్రతిఘటన దళ కమాండర్ గా పని చేసిన రామ్ లాల్ రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. అతన్ని మావోయిస్టులు పలు మార్లు హెచ్చరించినట్లు చెబుతున్నారు.