వైయస్సార్ కు సాటి లేరు: రోశయ్య

ఇళ్లు కోల్పోయినవారికి మెరక ప్రాంతాల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రాంతాల్లోనే బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం సాధ్యం కాదని, బాధితులు సహకరించి కొత్త ఇళ్లలోకి మారాలని ఆయన అన్నారు. సుంకేశుల ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. వరదల్లో ప్రజలు తమ ఆస్తులను కోల్పోయారని, అంతా తాము తెచ్చి ఇవ్వలేకపోయినా చేతనైన సాయం చేస్తామని ఆయన చెప్పారు. వ్యాపారులకు 50 వేల రూపాయల మేర పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోశయ్య వెంట మంత్రులు మాణిక్యవర ప్రసాద్, శిల్పా మోహన్ రెడ్డి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు.












Click it and Unblock the Notifications