హైదరాబాద్ లో జగన్ రాజకీయం

YS Jagan
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఇక హైదరాబాదులో తన రాజకీయాలు నడపనున్నారు. ఆయన సోమవారం ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో జగన్ కోసం సందడి ఏదీ లేదు. స్పష్టమైన సూచనలు రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు విమానాశ్రయానికి రాలేదని తెలుస్తోంది. నిజానికి ఈ నెల 5వ తేదీననే ఆయన హైదరాబాదు రావాల్సి ఉంది. కానీ కడప జిల్లాను వరద ముంచెత్తడంతో ఆయన రాకలో ఆలస్యం జరిగింది. ఆయన కడప జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు.

ఆయన హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన తన నివాసాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి సొంత నివాసానికి మారే అవకాశాలున్నాయి. అక్కడే ఆయన పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుసుకుంటారు. భవిష్యత్తు కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. రేపు ఈ నెల 13వ తేదీన మహారాష్ట్రతో పాటు మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగుస్తుండడంతో ఆయన తన భవిష్యత్తు కార్యక్రమానికి వ్యూహరచన చేయవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన తన పావులు కదిపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+