ఎంపీలకు మాల్యా విస్కీ సీసాలు

మీరు పంపిన బహుమతి నా జీవనశైలికి సరిపడదు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు పంపినప్పటికీ భారత సమాజం దాన్ని అంగీకరించదు అని ఆయన ఆ లేఖలో రాశారు. చాలా మంది మద్యం సేవిస్తూ ఉండవచ్చు కానీ మీలాంటి గౌరవప్రదమైన వ్యక్తులు పార్లమెంటు, పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగాల హుందాతనాన్ని మనసులో పెట్టుకుని ఉండాల్సిందని అన్నారు.
తనెవరో తెలియకుండా మాల్యా తనకు బహుమతి పంపడం పట్ల ఆయన తన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు కూడా. భారత పార్లమెంటేరియన్లకు అటువంటి బహుమతులు పంపకూడదని ఆయన సలహా ఇచ్చారు. తన ఇంటిలో ఇంకా కొంత సంస్కృతి మిగిలి ఉందని, మద్యం సేవించడం సమస్యలను సృష్టించడమే తప్ప సమస్యలను పరిష్కరించదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications