పాక్ ఇంత ప్రాధాన్యమా: రాహుల్

పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల ప్రభావం మనపై పడుతుందని, అయితే మన ఆలోచనల్లో పాకిస్తాన్ కు చాలా సమయం, ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. తనకు సంబంధించినంత వరకు మనం ఇస్తున్న దానిలో సగం సమయం సరిపోతుందని ఆయన అన్నారు. ప్రపంచ వైఖరి పాకిస్తాన్ పట్ల మారిందని, ఇది ఒక రోజు వ్యవహారం కాదని, దీర్ఘమైన ప్రక్రియ అని, భారత్ ఒత్తిడి పెట్టిందని, పాకిస్తాన్ పై ప్రపంచమంతా ఒత్తిడి పెడుతోందని ఆయన అన్నారు. కొన్ని అంశాలను పరిష్కరించుకున్నామని, మరి కొన్నింటిని పరిష్కరించుకోవాల్సి ఉందని, మనం మంచి స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు కేవలం జిన్నా గురించి మాట్లాడుతున్నారని, దానికి వేయేళ్ల చరిత్ర ఉందని, బిజెపి చరిత్ర ఇప్పుడే మొదలైందని, తాను జిన్నా గురించి ఒక సెకండు కూడా ఆలోచించబోనని ఆయన అన్నారు. భారత్ వెలుగుతోందని బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదాన్ని ప్రజలు తిరస్కరించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications