రోశయ్యను బురదలోకి లాగుతున్నారు: ఆనం

తెలుగువారి మనస్సుల్లోంచి వైయస్ రాజశేఖర రెడ్డిని తీసేయాలని వారు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో వారు అవగాహనకు వచ్చారని, కాంగ్రెసు పార్టీని తెరాసకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. వారికి ప్రజలతో సంబంధం లేదని, నాలుగు గోడల మధ్య కూర్చుంటారని ఆయన అన్నారు. అతీంద్రియ శక్తులతో అద్దంలో తాము కావాలనుకున్నదాన్ని చూస్తారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.












Click it and Unblock the Notifications