విశాఖపట్నం: ఒక దాడి కేసులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పై స్థానిక కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. విశాఖపట్నం నాలుగో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఈ వారంట్ జారీ చేసింది. తనపై హర్షకుమార్ తో పాటు 11 మంది తనపై దాడి చేశారని ఆరోపిస్తూ కృష్ణస్వరూప్ అనే వ్యక్తి 2006 ఫిబ్రవరిలో కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.