ప్రధాని పదవిపై మోజు లేదు: రాహుల్

Rahul Gandhi
రాంచీ: తనకు ప్రధాని పదవిపై మోజు లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. నక్సల్స్ ప్రభావిత జార్ఖండ్ రాష్ట్రంలో ఆయన పర్యటన రెండో రోజు గురువారం కూడా కొనసాగింది. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు. మావోయిస్టుల చేతిలో మరణించిన పోలీసు అధికారి ఫ్రాన్సిస్ ఇందువార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను దళితుల ఇళ్లకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి జరిగితే నక్సల్స్ సమస్యకు పరిష్కారం చూపవచ్చునని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

యుపిఎ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధీ గ్యారంటీ చట్టం కింద ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పేదల అనుకూలమైందేనని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సరిగా అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం తదితర రాష్ట్రాలు బాగా అమలు చేశాయని, కొన్ని రాష్ట్రాల్లో సరిగా అమలు కావడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించి నిధులు పంపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కొంత మేరకు మాత్రమే ఒత్తిడి పెట్టగలదని, రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేసే అభీష్టం లేకపోతే కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+