హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అర్హుడేనని, అయితే ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇది సరైన సమయం కూడా కాదని ఆయన అన్నారు.
జగన్ కు వ్యతిరేకంగా ఒక బలమైన లాబీ ప్రకటన వర్షం కురిపిస్తున్నారు. ఈ లాబీలో సర్వే సత్యనారాయణ చేరారు. జగన్ ను వ్యతికేరిస్తున్నట్లు కనిపించకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది.