పాకిస్తాన్ లో పరిస్థితి సీరియస్: ఆంటోనీ

భారత్ కు తాలిబన్ల నుంచి ముప్పు ఉందా అని ప్రశ్నిస్తే మన అంతర్గత భద్రతకు ఎదురయ్యే ఎటువంటి సవాల్ నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మన భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయని ఆయన జవాబిచ్చారు. ముంబై దాడుల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, దాంతో తీర ప్రాంత భద్రతా బలగాలకు, భారత నావికాదళాలకు మధ్య సమన్వయం అవసరమని గుర్తించామని, తీర ప్రాంత రక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, వాటిని పటిష్టం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
చైనా ముప్పును ఎదుర్కోవడానికి సద్ధపడ్డారా అని అడిగితే జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన సమాధానమిచ్చారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications