మహా మెజారిటీ దిశగా కాంగ్రెసు

ప్రభుత్వ ఏర్పాటుకు స్వతంత్రుల మద్దతు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చెప్పారు. అమరావతి సీటులో రాష్ట్రపతి కుమారుడు రావుసాహెబ్ షేకావత్ వెనకంజలో ఉన్నారు. ఈ విజయం కాంగ్రెసు - ఎన్సీపి జట్టుదని అశోక్ చవాన్ అన్నారు. చవాన్ నాందేడ్ జిల్లాలోని భోకార్ సీటులో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపి నేత ఛగన్ భుజ్ బల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కుమారుడు అమిత్ ముందంజలో ఉన్నారు.


Click it and Unblock the Notifications