మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలు

మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 267 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, ఎన్సీపి కూటమి విజయం సాధించే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెసు గాలి వీచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని 60 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో మూడు స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగతా 57 స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.












Click it and Unblock the Notifications