రోశయ్య పేరుకే పెద్ద మనిషి: కెసిఆర్

హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాససనభలో తీర్మానం చేయకపోతే పెన్ డౌన్, గన్ డౌన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. పాలనను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 28వ తేదీన జైలో భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దమ్ముంటే ఈ జైల్ భరో కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇక ఓపిక పట్టేది లేదని, ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట తప్పారని ఆయన అన్నారు. 610 జీవోను చంద్రబాబు కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికి రారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications