జగన్ అప్పుడే అంటే బాగుండేది: కెకె

జగన్ ఇలాగే చెప్తారని తాను ముందే ఊహించానని, మరో విధంగా చెప్తారని తాను అనుకోలేదని ఆయన అన్నారు. కొంత మంది వైయస్సార్, జగనే తమ అధిష్టానం అనే పద్ధతిలో మాట్లాడారని ఆయన అన్నారు. కొత్తగా వచ్చినవారు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కాంగ్రెసు సంస్కృతి తెలియక ఆ విధంగా మాట్లాడారని ఆయన అన్నారు. జగన్ సోనియా నాయకత్వాన్ని అంగీకరించడం మంచి పరిణామమని ఆయన అన్నారు.
గురువారం మధ్యాహ్నం వైయస్ జగన్ సోనియాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన భవిష్యత్తును సోనియా చేతిలో పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత సోనియా పిలవడంతో కేశవరావు సాయంత్రం ఆమెను కలిశారు.












Click it and Unblock the Notifications