కాంగ్రెసుపై బాధ్యత పెరిగింది: రోశయ్య

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెసు విజయం సాధించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు విజయం అందించినందుకు మూడు రాష్ట్రాల ప్రజలకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభలో తీర్మానం చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ పై ప్రతిస్పందించడానికి ఆయన నిరాకరించారు. మరే విషయాలపై కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తున్నా పట్టించుకోకుండా ఆయన వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications