కాబూల్ దాడిలో 9 మంది మృతి

నలుగురైదుగురు తాలిబన్ మిలిటెంట్లు యుఎన్ బంగళాలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు, భవంతికి చెందిన ఓ భాగాన్ని పేల్చి వేశారని తెలుస్తోంది. ఆటోమేటిక్ ఆయుధాల కాల్పుల శబ్దాలు బుధవారం ఉదయం ఆరున్నర గంటల నుంచే వినిపించడం మొదలు పెట్టాయి. అంతర్జాతీయ బలగాలు, అఫ్గాన్ పోలీసు బలగాలు భవనాన్ని చుట్టుముట్టాయి. ఎదురుకాల్పుల్లో మరణించిన మిలిటెంట్లు ఎవరనేది చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.యుఎన్ అతిథి గృహంపై దాడి చేసింది తామేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ చెప్పుకున్నాడు.












Click it and Unblock the Notifications