జమ్మూ: జమ్మూలో పూంఛ్ మేంధార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదలు హతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు మేంధార్ లోని తాల్వాలో మిలిటెంట్ల స్థావరంపై దాడి చేశాయి. ఈ సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.
ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రధాని మన్మోహన్ సింగ్ 18 కిలోమీటర్ల పొడవైన అనంతనాగ్ - ఖాజీగంజ్ సెక్షన్ లోని కాశ్మీర్ రైలు ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.