ఎంఎఫ్ హుస్సేన్ రాకకు ఏర్పాట్లు

కోర్టు కేసుల కారణంగా కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్న హుస్సేన్ సాధ్యమైనంత త్వరగా భారత్ రావాలని కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఇటీవల ఒక భావోద్వేగపూరితమైన విజ్ఞప్తి కూడా చేశారు. చిత్రాలు సృజనాత్మక వ్యక్తీకరణలని అంటూ ఢిల్లీ హైకోర్టు నిరుడు హుస్సేన్ పై కొన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టేసింది. ఢిల్లీలో మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయనేది చెప్పలేనని, హుస్సేన్ లాంటి వ్యక్తులు వేధింపులకు గురి కాకుండా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు తేవడం అవసరమని హుస్సేన్ తరఫు న్యాయవాది అఖిల్ సిబాల్ అంటున్నారు. హుస్సేన్ 2006 నుంచి దుబాయ్ లో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications