కెసిఆర్ బ్రోకరులా మారుతున్నాడు: లగడపాటి

కెసిఆర్ చేస్తున్న ఉద్యామాలు ప్రజా పోరాటాలు కావని, కెసిఆర్ రాజకీయ ఆరాటాలు మాత్రమేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఫ్రీజోన్ ఎక్కడా లేదని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో తెరాస నామరూపాలు లేకుండా పోతుందని ఆయన అన్నారు. కెసిఆర్ కు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి నల్లగొండ జిల్లాకు చెందినవాడని, అతని పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అంటే కెసిఆర్ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానే పోరాడుతున్నారని చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications