విశాఖపట్న: మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయురాలు తప్ప పార్టీకి కాదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. పార్టీ ముఖ్యం, పార్టీ బాగుంటామనే భావన సురేఖలో లేదని, ప్రతి ఒక్కరికీ పార్టీయే ముఖ్యం కావాలని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కొండా సురేఖ రాజీనామా ప్రభావం పార్టీపై ఏ విధమైన ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సురేఖ రాజీనామా వల్ల పార్టీకి నష్టం కూడా ఏమీ లేదని ఆయన అన్నారు.