న్యూఢిల్లీ: మంత్రి కొండా సురేఖ రాజీనామా వ్యవహారంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. రాజీనామా చేయాలనేది సురేఖ సొంత నిర్ణయమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర మంత్రి విస్తరణ గానీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు గానీ ఇప్పట్లో ఉండవని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం తమ దృష్టంతా వరద సాయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే ఉందని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించే తాను హైదరాబాద్ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా నిర్ణయం కొండా సురేఖ వ్యక్తిగతమని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని కాంగ్రెసు అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ అన్నారు.