కర్నూలు: పావురాలగుట్ట ప్రాంతాన్ని సీబీఐ గురువారం మరోమారు సందర్శించనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని సందర్శించి, సంఘటనా స్థలాన్ని మరోమారు పరిశీలించనున్నట్లు తెలిసింది.వైఎస్ మృతి చెంది రెండు నెలలు అవుతుండటంతో కేసులో పురోభివృద్ధితో పాటు, ఉన్నతస్థాయి సమాచారం కోసం సీబీఐ పావురాలగుట్టకు వెళ్లింది. ఇప్పటికే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను డీకోడ్ చేయడంతో పాటు మరిన్ని వివరాలను సీబీఐ ప్రభుత్వానికి నివేదించింది.
ఉన్నతస్థాయి విచారణకు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించేందుకు సీబీఐ బృందం బుధవారం కర్నూలు చేరుకుంది. సీబీఐ దర్యాప్తు బృందానికి డీఐజీ లక్ష్మీ నారాయణ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.