బెంగళూరు: కర్ణాటక భాజపా ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమైంది. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డికి మద్దతుగా 50మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను ఫ్యాక్స్ ద్వారా జనార్దన్ రెడ్డికి పంపారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు, వివాదస్పద గ్రామీణాభివృద్ధి మంత్రి శోభా కరంద్లాజెను పదవి నుంచి తప్పించడంతో పాటు, తన ప్రధాన కార్యదర్శి వి.పి.బలిగర్ ను బదిలీ చేయడానికి సిద్ధపడినా అసమ్మతి నాయకులు అంగీకరించలేదు. దీంతో వారు రాజీనామాలు చేశారు. నేడు యడ్యురప్ప, గాలి జనార్ధన రెడ్డీ సంయుక్తంగా మీడియా సమావేశంలో ప్రసంగించవలసి ఉంది. కానీ ఈలోపు ఇలా జరిగింది.