న్యూఢిల్లీ: ఎన్నికలు పదిహేను రోజుల తర్వాత ఎట్టకేలకు మహారాష్ట్రలో మంత్రివర్గం రేపు ప్రమాణస్వీకారం చేయబోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ సర్కారు వరసగా మూడోసారి విజయం సాధించింది. అయితే మంత్రివర్గానికి సంబంధించి ఇరుపార్టీలూ ఒక ఒప్పందానికి రావడానికి ఇంతకాలం పట్టింది. కాంగ్రెస్ తరఫున 23 గ్గురు మంత్రులు, ఎన్సీపీ తరఫున 20 మంది రేపు ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రమాణస్వీకారం చేశాకే ఎవరికి ఏ శాఖ అన్నది నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చెప్పారు.