గౌహతి: ప్రఖ్యాత క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కు కేటాయించిన కారు దొంగతనానికి గురయింది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరుగనున్న ఆరో వన్డే మ్యాచ్ కోసం గవాస్కర్ నింబస్ వ్యాఖ్యాతల బృందంతో కలిసి గౌహతి చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు సంస్థ ఓ కారును కేటాయించింది. శనివారం గవాస్కర్ హోటల్‌లో ఉన్న సమయంలో ఈ కారు దొంగతనానికి గురైంది. దీంతో నిర్వాహకులు ఆయనకు మరో కారును ఏర్పాటు చేశారు.