న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పా, మంత్రి గాలి జనార్దన్ రెడ్డిల మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. దీంతో గత కొంత కాలంగా బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి తెరపడినట్లైంది. నలుగురు మంత్రుల తొలిగింపున కు సీఎం యడ్యూరప్పా అంగీకరించడంతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని తెలిసింది. ఇదిలా ఉండగా బీజేపీ అగ్రనేత అద్వానీతో సీఎం, గాలి సోదరులు సమావేశం కానున్నారు. రాజీకి సంబంధించి ఇక్కడ నుంచే బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.