భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా విలవిల

నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి గూడూరు - రేణిగుంట మార్గంలో వెంకటగిరి దగ్గర్లో యాతలూరు రైల్వే స్టేషన్ వద్ద 44 కిలో మీటర్ల మేర ట్రాక్ కుంగింది. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు జిల్లాలో 10 వేల ఎకరాల మేర నారుమళ్లు నీట మునిగాయి. దాదాపు 400 కిలో మీటర్ల మేర ఆర్ అండి బి రోడ్లు, వేయి కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయి. జిల్లాలో నష్టం 2 కోట్ల రూపాయల మేర నష్టం ఉంటుందని ఒక అంచనా. గూడూరు, కావలి డివిజన్లలో వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.












Click it and Unblock the Notifications