రికార్డుల తరలింపును అడ్డుకున్న తెరాస

తెరాస నాయకులు రికార్డుల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రికార్డులను తారుమారు చేయడానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. ఈ సమయంలో పోలీసులు, ఆర్డీవో జోక్యం చేసుకుని రికార్డులను తిరిగి కార్యాలయంలో పెట్టించారు. కాగా, పాపన్నపేటకు తరలి వస్తున్న తెరాస కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక తెలుగుదేశం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు తెరాస కార్యకర్తల ఆందోళనను వ్యతిరేకిస్తున్నారు.తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు లక్ష్మీనగర్ కు వస్తే తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications