అక్కినేని నాగార్జున భూకబ్జాకోరు: రేవంత్ రెడ్డి

రాజకీయాల్లోని, సమాజంలోని కుళ్లును కడిగేస్తానని వచ్చిన లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తీవ్ర ఆరోపణలున్న నాగార్జున చేత ఎలా ప్రచారం చేయించుకున్నారని ఆయన ప్రశ్నించారు. అటువంటి నాగార్జున చేత ప్రచారం చేయించుకున్న జయప్రకాష్ నారాయణకు నీతి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ఆయన అడిగారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నాగార్జునను లక్ష్యంగా చేసుకుని లోకసత్తాపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకసత్తా తమ పార్టీ ఓట్లనే చీల్చే ప్రమాదం ఉండడంతో తెలుగుదేశం నాయకులు ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications