బాబు రాష్ట్రం ముక్కలకి తలొగ్గారు: జెపి

రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ కలర్ టీవీలు, నగదు బదిలీ పథకం వంటివాటిని ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయినా ఫరవా లేదనే దృష్టితో వ్యవహరించిందని ఆయన అన్నారు. సమాజం ముక్కలైనా ఫరవాలేదు, దేశం ముక్కలైనా ఫరవా లేదు గానీ ఆ పార్టీలకు ఓట్లే కావాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయం మారకూడదు, సమాజం మారకూడదనే పద్ధతిలో ఇతర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. అవినీతిపై జరుపుతున్న పోరాటానికి తెలుగుదేశం ఎందుకు కలిసి రావడం లేదని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications