నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ లో భర్తే భార్యపై యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జానీ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన భార్య రజితపై అందరూ చూస్తుండగానే యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో రజిత తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
జానీ సింగ్ దాడి అనంతరం పారిపోయినట్లు సమాచారం. కుటుంబ కలహాల వల్లనే జానీ సింగ్ భార్యపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. రజిత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.