సిబిఐకి ఓబుళాపురం: చిరు డిమాండ్

ఓబుళాపురం గనుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి తాము వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఉమ్మడి అంశాలుంటే అటువంటి సమావేశాలకు వెళ్తామని ఆయన చెప్పారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై కొన్నేళ్లుగా ప్రతిపక్షాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఓబుళాపురం ఖనిజాలను సొంత పరిశ్రమలకు వాడుకోవడానికి మాత్రమే అనుమతి ఉందని, అయితే వాటిని ఎగుమతి చేస్తూ నిబంధనలకు ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. గనుల లీజు రద్దు చేసి ప్రభుత్వమే గనుల తవ్వకాలను చేపట్టాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications