విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రిలో మహిళ మృతిపై ఆందోళన

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కార్పొరేట్ ఆస్పత్రులపై సామాన్య జనం ఆగ్రహం విజయవాడ నగరంలోనూ వ్యక్తమైంది. నగరంలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన యర్ర రమాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో గడ్డ ఉందని, శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వుందని చెప్పారు. దీంతో ఆమెను 15 రోజుల క్రితం సూర్యారావుపేటలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైదులు ఈ నెల 5వ తేదీన ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్స చేసి గడ్డను తొలగించారు.

క్రమంగా కోలుకుంటున్న రమాదేవి, మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం అందించడం ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.తన తల్లి రమాదేవి(45) మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుమార్తె వరలక్ష్మి ఆరోపించింది. దీం తో మృతురాలి బంధువులందరూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకు న్న సూర్యారావుపేట పోలీసులు ఆస్ప త్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువుల ఆందోళన చివరకు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు వరకు వెళ్ళింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X