హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తో గాలి లింక్: బాబుపై కాంగ్రెసు గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ఓబుళాపురం గనుల అధిపతి, కర్నాకట మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు వ్యాపార సంబంధాలున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలపై మల్లు భట్టి విక్రమార్క, ఏరాసు ప్రతాపరెడ్డి విడివిడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందరో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కలుస్తూ ఉంటారని, అంత మాత్రాన వ్యాపార లావాదేవీలు అంటగట్టడం సరి కాదని సరి కాదని, జగన్ తో గాలి జనార్దన్ రెడ్డికి వ్యాపార సంబధాలున్నాయని అనడం చంద్రబాబు కుటిల రాజకీయ నీతికి నిదర్శనమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యాపారవేత్తలు నామా నాగేశ్వరరావు, సుజనారెడ్డి, సిఎం రమేష్ వంటి వారి వ్యాపారాల్లో చంద్రబాబుకు వ్యాపార లావాదేవీలున్నాయా అని ఆయన అడిగారు.

బళ్లారి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీల మధ్య ఉన్న విభేదాలను ప్రభుత్వానికి అంటగట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని అనడం నీచమైన మాట అని ఆయన అన్నారు. రాష్ట్రంలో పది వేల మైనింగ్ ఓర్ కంపెనీలున్నాయని, ఒక్క ఓబుళాపురం మైనింగ్ కంపెనీపైనే తెలుగుదేశం విమర్శలు చేయడం వెనక నిజాలు త్వరలోనే బయటపడుతాయని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆడమన్నట్లు ఆడుతున్నారని ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు మోడీతో కలిసి కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X