హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య నుంచి స్పష్టమైన హామీ లభించని దరిమిలా ఓఎంసీపై ప్రత్యక్ష ఆందోళనను ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజా సంపదను పరిరక్షించేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగటమే మార్గమన్నారు. ఓబుళాపురంలో మైనింగ్ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అఖిల పక్షం నేతలతో కలిసి వెళ్లి సీఎంకు ఫిర్యాదు చేసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. మరో ప్రక్క పక్షనేత నారాయణ మాట్లాడుతూ, 'ఓబుళాపురం బాల్ ప్రస్తుతం సీఎం కోర్టులో ఉంది, వెంటనే చర్య తీసుకోకపోతే ఆ బాలే బాంబై పేలుతుంది,' అని వ్యాఖ్యానించారు.