నేను ప్రధానిని ఎలా అయ్యానంటే..మన్మోహన్ సింగ్

తను సామాన్యుడినని ప్రధాని మన్మోహన్ అన్నారు. చదువువల్లే తను ఉన్నత పదవికి చేరుకున్నానని, జీవితాన్ని మలు చుకోవడంలో చదువు ముఖ్య పాత్ర వహిస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక సామాన్యుడు ప్రధాని ఎలా కాగలిగారు? -అని అడగ్గా మన్మోహన్‌సింగ్ ఈ విధంగా స్పందించారు. ప్రతిపక్షం తనను 'బలహీన ప్రధాని" అని ఎద్దేవా చేయడాన్ని మన్మోహన్ తోసిపుచ్చారు. 'బలహీన ప్రధాని అన్నంత మాత్రాన నేను ఏమీ అనుకోవడం లేదు. ఏదైనా మంచి చేస్తున్నట్టు నాకనిపిస్తే నా మనస్సాక్షి అది చెబుతుంది. విమర్శించడం ప్రతిపక్షం పని. ఆ విమర్శకు నేను భయపడను" అని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని చెంతనే ఆయన భార్య గురు శరన్ కౌర్ కూచున్నారు. పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు ఎంతో హాయిగా కనిపించారు. మావోయిస్టుల హింసా కాండ దగ్గర్నుంచి సంకీర్ణ రాజకీయాల వరకు పదో తరగతి పరీక్ష రద్దు దగ్గర్నుంచి పేదపిల్లలు చదువుకోలేకపోవడం వరకు అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పారు.












Click it and Unblock the Notifications