విజయవాడ ఆస్పత్రిలో 6గురు పసికందుల మృతి

ముగ్గురు పసికందులవి సహజ మరణాలని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ పిల్లలు మరణించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికందుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పసికందుల మరణాలపై విచారణ జరుపుతున్నట్లు ఆస్పత్రి రెసిడెంట్ వైద్యాధికారి పి. రామగోపాల్ చెప్పారు. సంఘటనపై జిల్లా కలెక్టర్ పియూష్ కుమార్ విచారణకు ఆదేశించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆస్పత్రిని సందర్శించి వైద్యుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. స్థానిక కాంగ్రెసు శాసనసభ్యుడు మల్లాడి విష్ణు కూడా ఆస్పత్రిని సందర్శించారు.












Click it and Unblock the Notifications