Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెషావర్ లో పేలుడు: 6గురు మృతి

Peshawar
పెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ మిలిటెంట్ల దాడులతో అట్టుడుకుతూనే ఉన్నది. పెషావర్ లోని పోలీసు స్టేషన్ సమీపంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. వారంలో పెషావర్ లో ఇది ఐదో పేలుడు సంఘటన. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, 20 మంది దాకా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

పోలీసు స్టేషను సమీపంలోకి ఒక వాహనం వచ్చిందని, అది పేలిపోయిందని, దాంతో భారీ నష్టం వాటిల్లిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ భవనం, మసీదు, బాలుర పాఠశాల ధ్వంసమయ్యాయి. ఇది ఆత్మాహుతి దాడియా, కాదా అని తెలియడం లేదని పోలీసు అధికారి మొహమ్మద్ కరీం ఖాన్ అన్నారు. రద్దీగా ఉండే బుధ్ బేర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని అస్పత్రులకు తరలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+